పండుగలున్నాయ్ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..

ABN , First Publish Date - 2020-04-11T00:24:02+05:30 IST

ఏప్రిల్ నెలలో పండుగలు ఉన్నందున లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాలు...

పండుగలున్నాయ్ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో పండుగలు ఉన్నందున లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలిల శ్రీవాస్తవ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్‌ నెలలో పండుగలు ఉన్నప్పటికీ కొవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది...’’ అని పేర్కొన్నారు.


ఏప్రిల్ 9 వరకు వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 37,978 షెల్టర్లు, సహాయక శిబిరాలు నడుస్తున్నాయని ఆమె తెలిపారు. ‘‘వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, అవసరతలో ఉన్న ఇతరులుకు బస ఏర్పాటు చేశారు. ఇందులో 34000 సహాయక శిబిరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా.. 3,900 లకు పైగా సహాయక శిబిరాలను ఎన్జీవో సంస్థలు నిర్వహిస్తున్నాయి..’’ అని పుణ్య సలిల వెల్లడించారు. దేశవ్యాప్తంగా దాదాపు 26,225 ఆహార పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయనీ.. వీటి ద్వారా కోటి మందికి పైగా ఆహారం ఆహారం అందుతోందని ఆమె తెలిపారు. వీటిలో 14799 కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుండగా... మరో 11,426 కేంద్రాల ద్వారా ఎన్జీవో సంస్థలు అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయన్నారు.

Updated Date - 2020-04-11T00:24:02+05:30 IST