రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్రం దాటవేత ధోరణి

ABN , First Publish Date - 2021-09-08T22:19:11+05:30 IST

ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్రం దాటవేత

రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్రం దాటవేత ధోరణి

ఢిల్లీ: ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్రం దాటవేత ధోరణి అవలంభిస్తోంది. ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నివేదిక సమర్పించాయి. ప్రస్తుతం పనులను నిలిపివేసినట్లు నివేదికలో కేంద్రం పేర్కొంది. వాస్తవ, సాంకేతిక పరిస్థితులపై కేఆర్‌ఎంబీ ఇప్పటికే నివేదికను ఇచ్చిన విషయాన్ని కేంద్రం తెలిపింది. పర్యావరణ అనుమతులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని నివేదికలో కేంద్రం పేర్కొంది. జరిగిన పనులను చూస్తే డీపీఆర్‌ కోసం జరిగినట్లు కనిపించడం లేదని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా? లేదా? అన్న అంశంపై తమ వాదనలు వినాలని ఏపీ కోరింది. తమ వాదనలు వినిపించడానికి ఏపీ సమయం కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


రాయలసీమ ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని ఎన్టీటీకి ఫొటోలు, వీడియోలను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. తదుపరి విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్టీటీ తెలిపింది.  

Updated Date - 2021-09-08T22:19:11+05:30 IST