తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్

ABN , First Publish Date - 2022-01-25T22:45:07+05:30 IST

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. శ్రీరాంసాగర్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. శ్రీరాంసాగర్ వరదకాలువ ప్రాజెక్టుపై షోకాజ్ నోటీసులను జారీ చేసింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించడంతో పాటు అనుమతులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేశారని కేంద్రం పేర్కొంది. అనుమతుల ఉల్లంఘనలను ఎన్జీటీ సంయుక్త కమిటీ ధృవీకరిందంటూ కేంద్ర పర్యావరణ శాఖ నోటీసుల్లో వెల్లడించింది. గౌరవెల్లి సర్పంచ్ రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సంయుక్త కమిటీని  ఎన్జీటీ నియమించింది. ఉల్లంఘనలను కమిటీ ధృవీకరించింది. ప్రాజెక్టు దగ్గర నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ ఎన్జీటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ఎన్జీటీ వాయిదా వేసింది. 


Updated Date - 2022-01-25T22:45:07+05:30 IST