సెంట్రల్ విస్టా పనుల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తున్నాం:కేంద్రం

ABN , First Publish Date - 2021-05-11T22:33:35+05:30 IST

కోవిడ్ మహమ్మారి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం జరుగుతుండడంపై ప్రతిపక్షాలు సహా దేశంలోని అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సెంట్రల్ విస్టాపై ఉన్న శ్రద్ధ దేశంలో ప్రజల ప్రాణాలపై లేదంటూ రాహుల్

సెంట్రల్ విస్టా పనుల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తున్నాం:కేంద్రం

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పనులను నిలిపివేసేందుకు ఇది మరో ప్రయత్నం అని ఢిల్లీ హైకోర్టు ముందు మంగళవారం కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మొదటి నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాజా ప్రయత్నం కూడా అందులో భాగమేనని విమర్శించింది. ఇంతటితో ఆగకుండా పిటిషన్‌ కొట్టివేయడమే కాకుండా పిటిషన్‌దారుకు జరిమానా విధించాలని ధర్మాసనానికి విన్నవించింది. ఇక పని ప్రదేశంలో కూడా అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


కోవిడ్ మహమ్మారి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం జరుగుతుండడంపై ప్రతిపక్షాలు సహా దేశంలోని అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సెంట్రల్ విస్టాపై ఉన్న శ్రద్ధ దేశంలో ప్రజల ప్రాణాలపై లేదంటూ రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలంతా విమర్శలు గుప్పిస్తారు. ఇక ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్ దొరకని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టాకు 22 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2021-05-11T22:33:35+05:30 IST