ఢిల్లీ: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఎగుమతిదారులు సైతం తెలంగాణ నుంచి పెద్దఎత్తున బియ్యాన్ని ఎగుమతులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది కూడా తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు జరిగాయని ఆయన తెలిపారు. అయితే తెలంగాణలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు నేరుగా స్పందించేందుకు గోయల్ నిరాకరించారు.
ఇవి కూడా చదవండి