ఢిల్లీ: ఏపీలోని వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైజాగ్ మెట్రో కోసం ఏపీ ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2017లో ప్రతిపాదనను సమర్పించాలని ఏపీని కోరామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం పేర్కొంది. గతంలో రూ.12,345 కోట్లతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను ఏపీ సమర్పించిందని కేంద్రం తెలిపింది. అయితే తర్వాత దానిని కొనసాగించలేదని కేంద్రం పేర్కొంది.
ఇవి కూడా చదవండి