శత వసంతాల పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-05-23T07:34:13+05:30 IST

మండలంలోని పులితండా పంచాయతీ పరిధిలోని బడితండాలో ఆదివారం ధరావత్‌ ద్వాళి 100వ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు.

శత వసంతాల  పుట్టిన రోజు వేడుకలు
ద్వాళీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు

పాల్గొన్న ఐదు తరాల కుటుంబ సభ్యులు

చివ్వెంల, మే 22:  మండలంలోని పులితండా పంచాయతీ పరిధిలోని బడితండాలో ఆదివారం ధరావత్‌ ద్వాళి 100వ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో ఐదు తరాల కుటుంబ సభ్యులు పాల్గొని వృద్ధురాలితో కేక్‌ కట్‌ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధురాలు బంజారా నృత్యాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపర్చింది. ధరావత్‌ ద్వాళి-హనుమంతునాయక్‌ దంపతులకు నలుగురు మగ పిల్లలు, ఏడుగురు ఆడ పిల్లలు ఉన్నారు.  నాలుగో కుమారుడు రెడ్యానాయక్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా,  ఏడో కుమార్తె బుజ్జి టీచర్‌గా పని చేస్తోంది. మనుమలు, మనుమరాళ్లు 30మంది వివిధ ప్రభుత్వ హోదాల్లో ఉన్నారు. ద్వాళి పుట్టినరోజు వేడుకలో మొత్తం 150మంది మనమళ్లు, మనమరాళ్లు, ముని ముని మనమళ్లు, ముని మని మునవరాళ్లు పాల్గొనడంతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది. 


 చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

కోదాడ రూరల్‌, మే 22: ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందిచుకోవాలని కోదాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్యాం సుందర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కొమరబండ గ్రామంలో  న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా  కొమరబండ గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయం చేయడానికే కోర్టులు ఉన్నాయన్నారు. కార్యక్ర మంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చిరివేరు వెంకటేశ్వర్లు, న్యాయవా దులు  నర్సింహారావు, రాంరెడ్డి, నర్సయ్య, మురళి, శరత్‌,  పాల్గొన్నారు.

జడ్జి శ్యాంసుందర్‌ను సన్మానిస్తున్న గ్రామస్థులు 


Updated Date - 2022-05-23T07:34:13+05:30 IST