సినిమా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-24T06:29:51+05:30 IST

సినిమా రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సినిమా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని ఫిర్యాదు

పంజాగుట్ట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సినిమా రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని ఓ  నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్లారెడ్డిగూడ సుభా్‌షనగర్‌కు చెందిన కెప్టెన్‌ చౌదరి నటుడు. పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. 2018లో డైరెక్టర్‌ టీ.డీ ప్రసాద్‌వర్మ తాను సినిమా తీస్తున్నానని, అందులో నటిస్తే రోజుకు రూ. 30 వేల రెమ్యూనరేషన్‌ ఇస్తానని, రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ చౌదరి 14 రోజుల పాటు ఆ సినిమాలో నటించాడు. ఒప్పందం ప్రకారం ప్రసాద్‌వర్మ కెప్టెన్‌ చౌదరికి ఇస్తానన్న డబ్బులు చెల్లించలేదు. పలుమార్లు సినిమా నిర్మాత పుప్పాల సాగరికను అడిగినా ఫలితం లేకపోవడంతో చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 25,700 స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెం.2 ఫ్లోరా అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెం. 205లో పేకాటాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో  దాడి చేశారు.  నిర్వాహకుడు ఎన్‌. వెంకటశివారెడ్డి, ముల్లస్వామి (మౌలాలి), పూజారి సుబ్రహ్మణ్యశాస్త్రి(బీహెచ్‌ఈఎల్‌), వీఎస్‌ అప్పారావు (కొండాపూర్‌), మాలకొండయ్య(అమీర్‌పేట), పి. శ్రీనివా్‌స(వరంగల్‌), ఫణీందర్‌రెడ్డి(కేపీహెచ్‌బీ), ప్రవీణ్‌(సనత్‌నగర్‌), శ్రీనివా్‌సరెడ్డి, కరుణాకర్‌రెడ్డి(ఉప్పల్‌), కె. శైలజ(శ్రీనగర్‌కాలనీ), మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2021-02-24T06:29:51+05:30 IST