CCIలో 46 పోస్టులు

ABN , First Publish Date - 2022-05-14T20:17:49+05:30 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Cement Corporation of India Limited)(సీసీఐ) నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

CCIలో 46 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Cement Corporation of India Limited)(సీసీఐ) నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజనీర్లు: 27

విభాగాలు: ప్రొడక్షన్‌, మెకానికల్‌, సివిల్‌, మైనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు

ఆఫీసర్లు: 19

విభాగాలు: మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ తదితరాలు

అర్హత: గ్రాడ్యుయేషన్‌, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ, ఐసీఎ్‌సఐ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేస్తుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31

వెబ్‌సైట్‌: https://www.cciltd.in/

Read more