నాయీబ్రాహ్మణుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-11T06:13:59+05:30 IST

కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగు తుండడంతో ఖమ్మం జిల్లాలో ‘సెల్ఫ్‌ లాక్‌డౌన్‌’లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో నాయీబ్రాహ్మణ సంఘం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించింది.

నాయీబ్రాహ్మణుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌
వైరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

 పదిరోజులపాటు సెలూన్ల మూసివేతకు న్చిర్ణయం 

 17వరకు వైరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం బంద్‌

ఖమ్మం మయూరిసెంటర్‌/వైరా, మే 10: కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగు తుండడంతో ఖమ్మం జిల్లాలో ‘సెల్ఫ్‌ లాక్‌డౌన్‌’లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో నాయీబ్రాహ్మణ సంఘం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు పదిరోజులపాటు ఖమ్మం నగరంలో సెలూన్‌లు మూసిఉంచాలని తీర్మానం చేసినట్టు సంఘం గౌరవ అధ్యక్షుడు అలేటి వెంకటప్పయ్య, సురభి సైదులు సోమవారం మీడియాకు తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ ఈ నెల 11నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటుం దని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ దుకాణాలు తీయవద్దని, ఒకవేళ తెరిస్తే సంఘ నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

17 వరకు వైరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సెలవు 

వైరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కరోనా కలకలం రేపడంతో 17వతేదీ వరకు కార్యాలయాన్ని మూసివేసేందుకు అధికారులు నిర్ణయించారు. కార్యాలయంలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సబ్‌రిజిస్ట్రార్‌ అంకం కృష్ణయ్య తమ ఉన్నతాధికారులకు నివేదించారు.  17న తిరిగి కార్యాలయ పనులు యథావిధిగా కొనసాగిస్తామని సబ్‌రిజిస్ట్రార్‌ తెలిపారు.

కరోనాతో ఇద్దరి మృతి 

కారేపల్లి మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి సోమవారం కరోనాతో మృతిచెందాడు. వారం రోజులక్రితం అతడికి కరోనా సోకగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అన్నం ఫౌండేషన్‌ సిబ్బంది అతడి అంత్యక్రియలు నిర్వహించారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలోని వెంకటాపురానికి చెందిన ఓ వ్యక్తి (42) కరోనాతో సోమవారం మృతి చెందాడు. అన్నపురెడ్డిపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కరోనాతో మృతి చెందాడు. ఈనెల 3న అతడికి పాజిటివ్‌ రాగా కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  


Updated Date - 2021-05-11T06:13:59+05:30 IST