సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-20T15:16:55+05:30 IST

ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేందుకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలో ఉన్న సిద్ధయ్యగౌండన్‌పట్టికి చెందిన

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

చెన్నై : ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేందుకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలో ఉన్న సిద్ధయ్యగౌండన్‌పట్టికి చెందిన తోట్టన్‌స్వామి కుమారుడు సంజయ్‌కుమార్‌(15) సమీపంలోని నాయప్పన్‌పట్టిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడగా, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతుల్లో పాల్గొనేందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొనివ్వాలని సంజయ్‌ తండ్రిని కోరగా, ప్రస్తుతం డబ్బులు లేవని, తరువాత కొనిస్తానని బదులిచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన సంజయ్‌ ఇంట్లో ఉరేసుకున్నాడు. కొసప్రాణాలతో ఉన్న సంజయ్‌ను తల్లిదండ్రులు హుటాహుటిన తేని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక మృతి చెందాడు. ఈ ఘటనపై ఆండిపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-20T15:16:55+05:30 IST