Abn logo
Oct 27 2021 @ 07:00AM

Cellphone టవర్‌ ఏర్పాటుపై గ్రామస్తుల ఆందోళన

గుమ్మిడిపూండి(Chennai): తమ గ్రామంలో సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటు చేయరాదని డిమాండు చేస్తూ మంగళ వారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ సమీపం అత్తూపాక్కం గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటుకు గతవారం గ్రామ సభ ఏర్పాటుచేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ సభలో సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటును గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రైవేటు సంస్థ నిర్వాహకులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మంగళవారం సదరు సంస్థ నిర్వాహకులు టవర్‌ నిర్మాణం చేపట్టడాన్ని గమనించిన గ్రామస్తులు, పనులను అడ్డుకొని సమీపంలోని జాతీయ రహదారిపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి పోలీసులు అక్కడకు చేరుకొని వారికి సర్దిచెప్పి పంపించారు.

ఇవి కూడా చదవండిImage Caption