సెల్‌టవర్‌ ఏర్పాటుపై ఆందోళన

ABN , First Publish Date - 2021-03-08T05:14:27+05:30 IST

రమణక్కపేట (కొత్తపల్లి), మార్చి 7: రమణక్కపేటలో ఎలిమెంటరీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌పై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

సెల్‌టవర్‌ ఏర్పాటుపై  ఆందోళన

రమణక్కపేట (కొత్తపల్లి), మార్చి 7: రమణక్కపేటలో ఎలిమెంటరీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌పై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎలిమెంటరీ  పాఠశాలకు, ఇళ్ల సమూహాల మధ్య సెల్‌ టవర్‌ ఏర్పాటుపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టవర్‌ ఏర్పాటుపై గ్రామంలో ఎటువంటి దండోరా వేయించలేదని, గ్రామస్థుల అనుమతి తీసుకోకుండా సెల్‌టవర్‌ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఎలిమెంటరీ పాఠశాలలో చిన్నారులపై సెల్‌టవర్‌  రేడియేషన్‌ ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-03-08T05:14:27+05:30 IST