మళ్లీ పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

ABN , First Publish Date - 2021-12-02T07:07:47+05:30 IST

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర మరోసారి భగ్గుమంది. చమురు కంపెనీలు ఈ సిలిండర్‌ ధరను బుధవారం పెంచాయి. ...

మళ్లీ పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

19 కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.2,101కి చేరిక 

న్యూఢిల్లీ, డిసెంబరు 1: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర మరోసారి భగ్గుమంది. చమురు కంపెనీలు ఈ సిలిండర్‌ ధరను బుధవారం పెంచాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.100.50 పెరగడంతో ధర క్రితం ఉన్న రూ.2,000.50 నుంచి రూ.2,101కి చేరుకుంది. ముంబైలో ఈ సిలిండర్‌ ధర ఇంతకు ముందు రూ.1,950 ఉండగా.. ఇప్పుడు రూ.2,051కి చేరింది. కోల్‌కతాలో రూ.2,177కు, చెన్నైలో రూ.2,234.50కు చేరుకుంది.  వాణిజ్య సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ దుకాణాలు వంటి వాటిలో వినియోగిస్తుంటారు. గత నెల ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్‌ ధర ఒకేసారి రూ.266.50 పెరిగింది. ఇక గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధ ర మాత్రం యథాతథంగా ఉంది. ఢిల్లీలో 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.899.50గా ఉంది.

Updated Date - 2021-12-02T07:07:47+05:30 IST