Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 16:03:51 IST

Srinu vaitla: యంగ్‌ టైగర్‌ టు ప్యాన్‌ ఇండియా టైగర్‌.. నేనే సాక్షిని!

twitter-iconwatsapp-iconfb-icon
Srinu vaitla: యంగ్‌ టైగర్‌ టు ప్యాన్‌ ఇండియా టైగర్‌.. నేనే సాక్షిని!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ జూ.ఎన్టీఆర్‌ (Jr ntr)పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు అభిమానులు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి అభిమానులు, సినీ తారలు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘‘చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు(Happy birthday tarak). ఆయురారోగ్య నట ప్రస్థాన అభివృద్ధి  రస్తు’’ అని సీనియర్‌ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్‌ చేశారు. 


‘‘హ్యాపీ బర్త్‌డే తారక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సమయంలో మిమ్మల్ని కలిసి మాట్లాడటం ఎంతో సంతోషంగా అనిపించింది. మీరు ఇలాగే అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’’ 

– అజయ్‌ దేవ్‌గణ్‌(Ajay devagan)

Srinu vaitla: యంగ్‌ టైగర్‌ టు ప్యాన్‌ ఇండియా టైగర్‌.. నేనే సాక్షిని!

కన్నీళ్లు వచ్చేలా చేశారు: శ్రీనువైట్ల

‘‘నిన్ను చూడాలని’ మొదటి రోజు షూటింగ్‌ నుంచి ‘యంగ్‌ టైగర్‌’ ఇప్పుడు ‘ ప్యాన్‌ ఇండియా టైగర్‌’ వరకూ మీ అద్భుతమైన ఎదుగుదలకు నేను ప్రత్యక్ష సాక్షిని. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీ నటన అద్భుతం. కొమురం భీముడో’ పాటలో మీ నటనతో నాకు కన్నీళ్లు వచ్చేలా చేశారు. మరింత ఉన్నత స్థానాని మీరు  ఎదగాలని మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ బాద్‌షా’’. 

– శ్రీను వైట్ల


‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్‌. ఈ సంవత్సరమంతా ప్రేమ, విజయం, సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నా’’

– సాయితేజ్‌(Sai tej)

రామ్‌ పోతినేని, నాగశౌర్య, హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేశ్‌, ఈషా రెబ్బ, తమన్‌, దర్శకుడు బాబీ, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ తారక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement