Advertisement
Advertisement
Abn logo
Advertisement

డైటింగ్‌ చేస్తున్నారా!

ఆంధ్రజ్యోతి(09-12-2020)

డైటింగ్‌ అనగానే ఆహారం కొద్ది మోతాదులోనే తినాలనుకుంటాం. అయితే ఆకలి వేయడం అనేది సీజన్‌, మన ఆలోచన తీరు, మనం ఎంత చక్కగా నిద్రపోయాం, ఎంత సమయం వ్యాయామం చేశాం అనే విషయాలపై ఆధారపడుతుంది అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. 


రుజుతా తన తాజా పుస్తకం ‘ఈటింగ్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ డైటింగ్‌’లో డైటింగ్‌లో ఉన్నవారు ఆహారం తినే విషయంలో పాటించాల్సిన అయిదు గోల్డెన్‌ సలహాలను వివరించారు. గత వదేళ్లుగా ఆమె తన సోషల్‌ మీడియాలో సీజనల్‌ ఫుడ్స్‌, ఆరోగ్యం గురించి రాసుకొచ్చిన పలు విషయాలను ఒక చోట పేర్చి ఈ పుస్తకం తెచ్చారు. రుజుతా చెబుతున్న ఆ గోల్డెన్‌ టిప్స్‌ ఏమిటంటే...


ఆహారాన్ని ఒక వరంలా చూడాలి. మన కంచంలో ఆహారం వడ్డించుకునేటప్పుడు రైతులతో సహా ఎందరికో కృతజ్ఞతలు చెప్పాలి. ఆహారాన్ని వృథా చేయొద్దు. 

తినేది కొద్ది ఆహారమే అయినా మనసు పెట్టి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. ఆకలి వేయడం అనేది సీజన్‌, మన ఆలోచన విధానం, నిద్ర సమయం, వ్యాయామ సమయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొద్దిగా తిన్నా సరే ధ్యాస పెట్టాలి. 

కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, క్యాలరీలు పరిమితి మించకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు స్థానిక, సీజనల్‌, సంప్రదాయ ఆహారమే తినాలి.

Advertisement
Advertisement