Abn logo
Sep 17 2020 @ 12:11PM

ప్రధాని మోదీకి సినీ ప్రముఖుల విషెస్!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. 


గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీగారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ ఘనమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వంలో మన భరతమాత శ్రీ అరబిందో కలలు కన్న తన నిజమైన స్ఫూర్తి శిఖరాలను తాకుతుందని ఆశిస్తున్నా   -పవన్ కల్యాణ్


ప్రియమైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో సంవత్సరాలపాటు దేశానికి మీరు ఉన్నతమైన సేవలందించాలని కోరుకుంటున్నా  - చిరంజీవి


ప్రధానమంత్రి మోదీగారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా  - మోహన్ లాల్


గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ స్ఫూర్తివంతమైన, దృఢమైన నాయకత్వం, దార్శనికత ఎంతో మార్పు తీసుకొచ్చింది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా  - మహేష్ బాబు


గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఫిట్‌నెస్ మీద మీరు చూపించే శ్రద్ధ నాకు ప్రతిరోజూ స్ఫూర్తి కలిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నా  - రకుల్ ప్రీత్


Advertisement
Advertisement
Advertisement