condolence: మహేష్‌ బాబు మాతృమూర్తి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2022-09-28T15:09:54+05:30 IST

ప్రిన్స్ మహేష్ బాబు మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

condolence: మహేష్‌ బాబు మాతృమూర్తి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh babu) మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సతీమణి ఇందిరాదేవి (Indiradevi) మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఇందిరాదేవి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh), ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ (Sailajanath), ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna) తదితరులు సంతాపం తెలియజేశారు. మహేష్‌బాబు, ఇతర కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2022-09-28T15:09:54+05:30 IST