మాస్క్‌ ధరించండి... కరోనాను దరి చేరనివ్వకండి!

ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST

చిన్న మాస్క్‌ అని చీప్‌గా తీసిపారేయకండి. కంటికి కనిపించని శత్రువు కరోనా మనల్ని కాటేయకుండా కాపాడగలదు. తెలిసో తెలియకో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొనే విషయంలో ప్రజల్లో చాలామంది తప్పులు చేశారు...

మాస్క్‌ ధరించండి... కరోనాను దరి చేరనివ్వకండి!

చిన్న మాస్క్‌ అని చీప్‌గా తీసిపారేయకండి. కంటికి కనిపించని శత్రువు కరోనా మనల్ని కాటేయకుండా కాపాడగలదు. తెలిసో తెలియకో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొనే విషయంలో ప్రజల్లో చాలామంది తప్పులు చేశారు. చేస్తూనే ఉన్నారు. ఆ తప్పుల్లో మాస్క్‌ ధరించకపోవడం ఒకటి. ‘వేర్‌ ఏ మాస్క్‌ ఇట్స్‌ సేఫర్‌’ (మాస్క్‌ ధరించండి. అది (కరోనా సోకకుండా) రక్షిస్తుంది) హ్యాష్‌ట్యాగ్‌తో స్టార్స్‌ మాస్క్‌, చేతికి గ్లౌజులు లాంటివి ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాశ్‌ గోవారీకర్‌. గతంలో తీసిన సెలబ్రిటీల ఫొటోలతో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు కరోనాపై పోరాటంలో మాస్క్‌ ప్రభావం ఎంతనేది ప్రజలకు తెలిసేలా... సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కార్యక్రమం చేపట్టారాయన.


ఎవరీ అవినాశ్‌? అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా సహా క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని వంటి స్టార్స్‌తో ఇంత అద్భుతమైన ఫొటోలు ఎలా తీశారు? అనుకుంటున్నారా! ప్రముఖ హిందీ దర్శకుడు ఆశుతోష్‌ గోవారీకర్‌కి ఈయన సోదరుడు. అలాగనీ, ఫొటోగ్రాఫర్‌గా ఆయన ప్రయాణించింది పూలదారిలో కాదు. కెరీర్‌లో ప్రతిదీ తప్పులు చేయడం వల్ల తెలుసుకుని ఈ స్థాయికి చేరుకున్నాననీ ఒకానొక సందర్భంలో అవినాశ్‌ గోవారీకర్‌ అన్నారు. ఇప్పుడు ఆయనో స్టార్‌ సెలబ్‌ ఫొటోగ్రాఫర్‌. అలాగనీ, దర్పం ప్రదర్శించరు. దీనికి కారణం ‘మా అమ్మే’ అంటారాయన.




‘‘అమ్మ చేతి వంట? అమ్మ చేతి దెబ్బ?? ఏది మంచిది?! నేను అమ్మ చేతి వంట లేకపోయినా బతకగలను. అయితే, అమ్మ చేతి దెబ్బలే నన్ను నేలపై నిలబడేలా, నిగర్విలా చేశాయి. అందుకే, లవ్యూ అమ్మ. నేను నీ దెబ్బలకు ఎక్కువ విలువిస్తా. కానీ, మా కోసం ఎప్పుడూ వండిపెడుతూ ఉండు’’ అని మాతృదినోత్సవం సందర్భంగా అవినాశ్‌ గోవారీకర్‌ ఓ పోస్ట్‌ పెట్టారు.

ఈ ఫొటోగ్రాఫర్‌ ప్రారంభించిన ‘వేర్‌ ఏ మాస్క్‌ ఇట్స్‌ సేఫర్‌’ కార్యక్రమానికి స్టార్స్‌ నుంచి అమితమైన మద్దతు లభిస్తోంది. ‘వేర్‌ మాస్క్‌’ అంటూ మహేశ్‌బాబు సైతం స్టార్స్‌ అందరూ ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST