అంతా రామమయం.. ఊరూరా కాషాయ జెండాల ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-08-06T18:22:56+05:30 IST

అయోద్యలో రామాలయ భూమిపూజ నిర్వహించనుండడంతో జిల్లా వ్యాప్తంగా రామమయంగా మారింది. బుధవారం ప్రధాని మో దీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో జిల్లాలో ప్రతి ఇంటిపైన కాషాయ జెండాను ఎగురవేశారు.

అంతా రామమయం.. ఊరూరా కాషాయ జెండాల ఆవిష్కరణ

రామమందిర నిర్మాణానికి భూమిపూజతో భక్తుల సంబురాలు


నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): అయోద్యలో రామాలయ భూమిపూజ నిర్వహించనుండడంతో జిల్లా వ్యాప్తంగా రామమయంగా మారింది. బుధవారం ప్రధాని మో దీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో జిల్లాలో ప్రతి ఇంటిపైన కాషాయ జెండాను ఎగురవేశారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రామాలయం త్వరితగతిన పూర్తికావాలని వేడుకున్నారు. భక్తులు, బీజేపీ, వీహెచ్‌పీ, హిందూ సంస్థలు తమ పరిధిలోని  గ్రామాలు, కాలనీలలో ప్రతి ఇంటి వద్ద రాముడికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఇంటిపైన కాషాయ జెండాలు ఎగురవేసి రాముడి జీవి తం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, రామ రాజ్య స్థాపనకు నాంది అని చెబుతూ జెండాలు ఏర్పాటు చేశారు. 


సాయంత్రం రాముని స్మరిస్తూ ఇంటి ముందు దీపాలు వెలిగించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు వివిధ దేవాలయాల్లో రామాలయ నిర్మాణం అందరి సహకారంతో త్వరగా పూర్తికావాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు దీపాలను వెలిగించి ఐక్యత చాటిచెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా బుధవారం మార్వాడిగల్లీలో బీజేపీ నాయకులతో కలిసి పూజలు చేశారు. టీవీలో భూమి పూజను తిలకించారు.

Updated Date - 2020-08-06T18:22:56+05:30 IST