ఇళ్ళల్లోనే పండుగ వేడుకలు

ABN , First Publish Date - 2021-09-04T05:51:51+05:30 IST

వినాయక చవితి పండుగను ఇళ్లకే పరిమితం చేయాలని, బహిరంగప్రదేశాలలో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ముఖ్యమంత్రి ప్రకటించారు. పండుగలన్నీ కూడా అలా ఎవరి ఇళ్లకువారే పరిమితమై చేసుకుంటే....

ఇళ్ళల్లోనే పండుగ వేడుకలు

వినాయక చవితి పండుగను ఇళ్లకే పరిమితం చేయాలని, బహిరంగప్రదేశాలలో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ముఖ్యమంత్రి ప్రకటించారు. పండుగలన్నీ కూడా అలా ఎవరి ఇళ్లకువారే పరిమితమై చేసుకుంటే  శబ్దకాలుష్యం, వాతావరణ కాలుష్యం తగ్గుతాయి. ఇది కరోనా కాలం వినాయకుడి  నిమజ్జన సమయంలో జనం గుంపులు గుంపులుగా చేరితే కరోనా విపరీతంగా ప్రబలే అవకాంశం ఉంది. అందువల్ల సామూహికంగా జనం పాల్గొనే నిమజ్జనాలు తగవు వినాయక చవితి మాదిరే ఎవరైనా పండుగలను ఇళ్ళలోనే చేసుకునేవిధంగా ప్రజల ఆలోచనావిధానంలో మార్పు తీసుకరావలసిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఆదివారం చర్చిలలో వేలాదిమందితో జరిపే జరిపే ప్రార్ధనలనుకూడా నిలిపివేసి ఇళ్ళలోనే చేసుకునేలా చూడాలి. ఏ మతంవారైనా దైవ భక్తిని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. పండుగల పేరుతో జరిగే  మైకులగోలను అరికట్టాలి. అలాగె సుప్రీంకోర్టు చెప్పినవిధంగా ప్రభుత్వ స్థలాలలో విగ్రహాలు,  మందిరాల నిర్మాణాలను అడ్డుకోవాలి. 


నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2021-09-04T05:51:51+05:30 IST