ముగిసిన సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-18T04:58:01+05:30 IST

రొంపివలసలో గత నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న సంక్రాంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. పండగను పురస్క రించుకొని గ్రామానికి చెందిన యువత ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు.

ముగిసిన సంక్రాంతి వేడుకలు
పాతపట్నం: రంగవల్లుల పోటీలో పాల్గొన్న మహిళలు

రొంపివలస(పాతపట్నం): రొంపివలసలో గత నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న సంక్రాంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. పండగను పురస్క రించుకొని గ్రామానికి చెందిన యువత ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా రంగవల్లుల పోటీలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆదివారం సామూహిక విందులు నిర్వహించారు. రంగవల్లుల పోటీ విజేతలకు బహుమతులను అందిం చారు.  కార్యక్రమంలో యువత, గ్రామపెద్దలు పాల్గొని సందడి చేశారు.

వ్యాసరచన, ముగ్గుల పోటీలు

పోలాకి: పోలాకి స్వగ్రామ ప్రగతిసేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ‘గజేంద్ర మోక్షం.. మానవ జీవన విధానం’ అనే అంశంపై  సరుబుజ్జిలి మండలం మల్లికార్జునపురానికి చెందిన రంప సాయికుమార్‌చే ప్రవచనం ఏర్పాటు చేసి ఆయనను సంఘ ప్రతినిధులు సత్కరించారు.  

ముగిసిన వాలీబాల్‌ పోటీ

పలాసరూరల్‌: పొత్రియ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వ హించిన వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముుగిశాయి. ఈ పోటీల్లో ప్రథ మ విజేతగా గట్టూరు జట్టు నిలవగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పొత్రి య, సవర గోవిందపురం జట్లు నిలిచాయి. విజేతలకు సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వినోద్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్‌.భువన్‌, సవర కుమార్‌ పాల్గొన్నారు. 

విజేతలకు బహుమతి ప్రదానం

వజ్రపుకొత్తూరు: గరుడభద్ర గ్రామంలో సంక్రాంతి సందర్భంగా షైనింగ్‌ స్టార్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించి, శనివారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. గ్రామ పెద్దలు ఈశ్వర రావు, పాపారావు, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T04:58:01+05:30 IST