సింరేణిలో సంబరాలు

ABN , First Publish Date - 2021-07-27T06:24:11+05:30 IST

సింగరేణి కార్మికుల రిటైర్‌మెంట్‌ వయో పరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల గోదావరిఖని చౌరస్తాలో టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.

సింరేణిలో సంబరాలు
గోదావరిఖనిలో బాణాసంచా కాల్చుతున్న టీబీజీకేఎస్‌ నాయకులు

- పదవీ విరమణ పెంపుపై కార్మికుల హర్షం

గోదావరిఖని, జూలై 26: సింగరేణి కార్మికుల రిటైర్‌మెంట్‌ వయో పరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల గోదావరిఖని చౌరస్తాలో టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీబీజీకేఎస్‌ ప్రఽధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల వయోపరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ కారుణ్య నియామకాల క్రింద లింగబేదం లేకుండా అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షనీయమని, ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు మిర్యాల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, నూనె కొమురయ్య, దేవ వెంకటేశం, యాదవరెడ్డి, వెంకటేష్‌, కృష్ణమూర్తి, పుట్ట రమేష్‌, గంగాధర్‌, చెల్పూరి సతీష్‌, శ్రావణ్‌, అల్లం ఐలయ్య, దొరగండ్ల మల్లయ్య, పెంచాల తిరుపతి, బేబి శ్రీనివాసస్‌, నాయిని శంకర్‌, రాజిరెడ్డి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-27T06:24:11+05:30 IST