అన్నమయ్య జిల్లాలో వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T04:31:43+05:30 IST

స్థానిక పోలీ స్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న 76వ స్వా తంత్య్ర దినోత్సవాలు వైభవంగా జరిగాయి.

అన్నమయ్య జిల్లాలో వేడుకలు
ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులతో అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

రాయచోటి(కలెక్టరేట్‌), ఆగస్టు15: స్థానిక పోలీ స్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న 76వ స్వా తంత్య్ర దినోత్సవాలు వైభవంగా జరిగాయి.   ప్రజాప్రతినిధులు, అన్నమయ్య జిల్లా రాయచో టి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ శార ద, డీఆర్‌ఓ సత్యనారాయణ, ఆర్డీఓ రంగస్వా మి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, తహసీల్దార్‌ రవిశంకర్‌రెడ్డి, వివిధశాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సందేశం అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాలోని 7 పటాలాల పోలీసు దళాలు కవా తు నిర్వహిస్తూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్‌  పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు గౌరవ వందనం సమర్పించారు. సీరియర్‌ సిటిజన్‌ షేక్‌. భానుబీ, సనా నాగులమ్మకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సన్మానించారు. కార్యక్రమంలో దిశ పోలీస్‌ శకటం, వ్యవసాయశా ఖ, ఉద్యానవనశాఖ, పశుసంవర్థకశాఖ, గృహ నిర్మాణశాఖ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకం, ఆర్డబూ్ల్యుఎస్‌, శానిటేషన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 108, 104 శకటం, శిశుసంక్షేమశాఖ, రాయచో టి మున్సిపల్‌ కార్పొరేషన్‌ శకటం, విద్యాశకటం ప్రదర్శనలో పాల్గొన్నాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

 స్థానిక  పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం జిల్లా అన్ని శాఖల అధికారులకు, వారి సిబ్బందికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి ప్రశంసా  పత్రం అందజేశారు.

Updated Date - 2022-08-16T04:31:43+05:30 IST