బహిరంగ ప్రదేశాల్లో సంబరాలు నిషేదం

ABN , First Publish Date - 2020-08-11T10:36:29+05:30 IST

కృష్ణాష్టమి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో సంబరాలతో పాటు, సామూహిక ఉట్లు కొట్టే కార్యక్రమాలు నిషేదమని జిల్లా అదనపు ఎస్పీ

బహిరంగ ప్రదేశాల్లో సంబరాలు నిషేదం

జిల్లా అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి


జగిత్యాల టౌన్‌, ఆగస్టు 10 : కృష్ణాష్టమి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో సంబరాలతో పాటు, సామూహిక ఉట్లు కొట్టే కార్యక్రమాలు నిషేదమని జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అన్నారు. జగిత్యా ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం విలేకరులు సమావేశం నిర్వహించి అదనపు ఎస్పీ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో కరోనా విజృభింస్తున్న తరుణంలో కోవిడ్‌ నిబంధనలకు అణుగునంగా మంగళ వా రం కృష్ణాష్టమి వేడుకలను భక్తులు గుళ్లల్లో జరుపుకోవాలని కోరారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఉట్లు కొట్టే కార్యక్రమాలు నిర్వహించవద్ద న్నారు. నిభందనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో సీఐ జయేష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కరోనాను జయించి విధుల్లో చేరిన ఆరుగురు కానిస్టేబుళ్లకు పుష్ఫగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. 

Updated Date - 2020-08-11T10:36:29+05:30 IST