వైభవంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T04:55:51+05:30 IST

బద్వేలుడివిజన్‌ వ్యాప్తంగా మూడు రోజుల సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయి.

వైభవంగా సంక్రాంతి సంబరాలు
గోపవరంలో గొబ్బెమ్మలను ఊరేగిస్తున్న మహిళలు

బద్వేలు, జనవరి 16 :బద్వేలుడివిజన్‌ వ్యాప్తంగా  మూడు రోజుల సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయి. పల్లె పట్టణం అని తేడాలేకుండా ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల రంగవల్లులతో మురిసిపోయింది.  సంప్రదాయ బద్ధంగా ఆలయాల్లో పూజలు నిర్వహించి సంక్రాంతి లక్ష్మికి మహిళలు నీరాజనాలు పలికారు. కనుమ పండుగ రోజు పాడి పశువులను సంప్రదాయంగా అలంకరించారు. 

ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జనం

పట్టణంలోని అబ్బరాతివీధిలో మహిళలు ఆదివారం గొబ్బెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ చివరి రోజుఅయిన కను మ పండుగ సందర్భంగా  మహిళలందరూ   గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేసి పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించి, నెల్లూరురోడ్డులోని నాగులచెరువులో నిమజ్జనం చేశారు. 

గోపవరంలో : సంక్రాంతి పండుగ మూడు రోజులను పల్లె ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పట్టణాల్లో ఉన్న వారంతా పండుగ కోసం పల్లెలకు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివారం చాలా గ్రామాల్లో గొబ్బెమ్మలను మహిళలు పూజించి గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేశారు. 

కలసపాడులో : మండలంలోని కొండపేటలో సంక్రాంతి  సందర్భంగా గ్రామంలోని యువత అనేక కార్యక్రమాలను నిర్వహించారు. రంగోలి పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి గ్రామంలోని పెద్దల సహకారంతో బహుమతులు అందజేశారు.

పోరుమామిళ్లలో: మండలంలో సంక్రాంతి వేడుకలను  మండల ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు.  శని, ఆదివారాల్లో ముగ్గుల పోటీలు పార్వేట  కులుకుభజన  కార్యక్రమాలు నిర్వహించారు. పోరుమామిళ్లలోని రామాయపల్లెలో  గొబ్బెమ్మలను  ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కనుమ రోజు ముగ్గుల పోటీలు డ్యాన్సులు, కబడ్డీ, పోటీలు నిర్వహించారు.  నాగుల కుంటలో సీతారాముల విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. ఊరిబయట కుందేళుతో పార్వేట కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగస్తులు, బంధువులు ఈ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలను జరుపుకున్నారు. 

సింహాద్రిపురంలో: సంక్రాంతి సంబరాలు మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, ఇతరులకు బైక్‌ స్లో రేస్‌, నవ్వుల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌, (కుర్చీలాట), పరుగు పందెం తదితర పోటీలు నిర్వహించి విజేతలకు ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ ఆంజనేయులు, నిర్వహకులు చీమలఅశోక్‌, మారుతి, గురుశేఖర్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అట్లూరులో: మండల వ్యాప్తంగా మూడు రోజులుగా జరుపుకున్న సంక్రాంతి సంబరాలు ఆదివారంతో ముగిశాయి. పండగను పరష్కరించుకోని గ్రామాల్లో యువత ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లుల పోటీలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 

బి.కోడూరులో : మండల పరిధిలో సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. అయ్యవారిపల్లె గ్రామంలో ఆదివారం కనుమ పండుగ పురస్కరించుకొని  విద్యార్థినులకు సరదాగా ముగ్గుల పోటీ లు నిర్వహించి విజేతలకు  గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. 

కాశినాయనలో: మండలంలో సంక్రాంతి పండుగను ప్రజలు ’ంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. రెండవ రోజు మకర సంక్రాంతినాడు మహిళలు ఇం టి ముంగిట వేసిన రంగు రంగుల ముగ్గులు పండుగకు ప్రత్యేక శోభనిచ్చాయి. మూడవ రోజైన కునుమ పండుగనాడు నర్సాపురం, బాలరాజుపల్లె  తదితర గ్రామాల్లో రాములవారి గ్రామోత్సవం, పారేటోత్సవాలు నిర్వహించారు. నర్సాపురం గ్రామోత్సవంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది.

అలరించిన సంక్రాంతి వేడుకలు

మైదుకూరు, జనవరి 16 : మూడు రోజుల సంప్రదాయ పండుగైన సంక్రాంతి ఆటపాటలతో  అత్యం త వైభవంగా వేడుకలను నిర్వహించారు. మైదుకూరు పట్టణంలోని వివిధ ఆలయాలల్లో పాటు మం డలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. శ్రీలక్ష్మి మాదవరాయ స్వామి, కోదండ రామాలయం, వెంకటేశ్వరుడు, ఇలా పలు ఆలయా ల్లో ఆయా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  సంక్రాంతి పూజలు నిర్వహించారు.  అలాగే యువకులు సాంప్రదాయమైన కబడ్డీ, త్రోబాల్‌, క్రికెట్‌ తదితర ఆటలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. వివిధ ఆలయాల ఆవరణలో  వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  

ఆలయాల్లో పూజలు చేసిన ప్రముఖులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖులు ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. పట్టణంలోని  లక్ష్మి మాదవరాయస్వామి ఆలయంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో శనివారం శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆదివారం మాజీ మంత్రి డాక్టర్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్‌ భూమిరెడ్డి సుబ్బరాయుడు సభ్యులతో కలసి శాలువతో సత్కరించారు.  ఈ సందర్భంగా డీయల్‌ రవీంద్రారెడ్డి లక్ష రూపాయల నగదును ఆలయ ప్రహారీ నిర్మాణం కొరకు అందజేశారు. అలాగే టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డికూడా దర్శించుకున్నారు. 

వాసవీక్లబ్‌, ఆవోపా ఆధ్వర్యంలో .. 

స్థానిక వాసవీ క్లబ్‌  ఆధ్వర్యంలో సంక్రాంతి  వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండల పరిషత్‌ ఆవరణలో మహిళలకు ముగ్గులు, చిన్నారులకు గాలిపటాలు, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. అలాగే ఆవోపా ఆధ్వర్యంలో అమ్మవారిశాలలో గోపూజ నిర్వహించారు. 

సంప్రదాయంగా సంక్రాంతి 

పులివెందుల రూరల్‌, జనవరి 16: సంప్రదాయ బద్ధంగా సంక్రాంతి వేడుకలను  ఆహ్లాదభరిత వాతావరణంలో నిర్వహించారు. పులివెందుల శిల్పారామంలో శని, ఆదివారాల్లో నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శాస్త్రీయ, సినీ, జానపద గీతాలకు చిన్నారులు నృత్యం చేశారు.   సందర్శకుల తాకిడి ఉన్నప్పటికి ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఓ సుధాకర్‌ పోలీసుల సహకారం తీసుకున్నారు. 

వేంపల్లెలో: సంక్రాంతి, కనుమ పండుగ వేడుకలను వైభవంగాజరుపుకొన్నారు. స్థానిక గౌరీనగర్‌లో చిన్నపిల్లలు, వృద్ధులకు ఆటలు పోటీలు నిర్వహించా రు.  గౌరీదేవి బలిజ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చింతలమడుగుపల్లె వద్ద  బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. 

లింగాలలో: తెలుగు వారి  పండుగ సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు.  వైసీపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ సారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి, రెండో, మూడో బహుమతులుగా రూ.5వేలు, రూ.2వేలు, రూ.1000 అందించారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ హృషికేశ్వరరెడ్డి, ఏపీఎం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ లక్ష్మినారా యణమ్మ, లింగాల సర్పంచు అనిల్‌, లోకేశ్వరరెడ్డి, శివశంర్‌రెడ్డి, బాలచెన్నారెడ్డి, రామకృష్ణారెడ్డి, అభిలాష్‌, ప్రజలు పాల్గొన్నారు.





Updated Date - 2022-01-17T04:55:51+05:30 IST