ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-03T06:00:39+05:30 IST

గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ జీ పాత్ర మరువలేనిదని పలువురు పే ర్కొన్నారు.

ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
బత్తలపల్లిలో నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు



 (ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ జీ పాత్ర మరువలేనిదని పలువురు పే ర్కొన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రభుత్వ , ప్రైటు పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్ట ణంలోని గాంధీసర్కిల్‌ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి గాంధీవిగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బీజేపీ, ఆర్యవైశ్యసంఘం తదితరుల ఆధ్వర్యంలో గాంధీవిగ్రహానికి వూల మాల వేసి నివాళులర్పించారు. శ్రీసాయి, వివేకానంద డిగ్రీకళాశాలలు తదితర సంస్థల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీజయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిం చారు. కదిరి పట్ట ణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో, సీపీఐ, ముస్లిం, మైనార్టీ ఎంప్లా యిస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన, ఆర్పీసీ  ఆధ్వర్యంలో గాంధీ జ యంతి వేడుకనలను ఘనంగా నిర్వహించారు. గాండ్లపెంటలోని టీడీపీ కార్యాలయంలో గాంధీ. జీకి ఘనం నివాళులర్పించారు.   గాంధీ  చిత్రపటానికి పలురకాల డిమాండ్ల వినతిపత్రం అందిం చారు. అలాగే మండలంలోని వివిధ సచివాలయాల్లో సర్పంచల అధ్యక్షతన గాంధీజయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నంబులపూల కుంట ఎంపీడీఓ కార్యాలయంలో  లాల్‌బహుదూర్‌ శాస్ర్తీ, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎంపీడీఓ ఆదినారాయణ,  తదితరులు నివాళులర్పించారు. ఓబుళదేవరచెరువులోని ప్రభుత్వ కార్యాలయాల్లో  నామమా త్రంగా జయంతి వేడుకలు నిర్వహించగా, మరికొన్నిచోట్ల  వాటి ఊసే లేదు. నల్లచెరువు మండల వ్యాప్తంగా గాంధీ జయంతి, లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. నల్లమాడ  మండల పరిధిలోని సచివాలయాల్లో ఆదివారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-10-03T06:00:39+05:30 IST