‘యోగా సప్తాహం’ .. కోటి సూర్యనమస్కారాలే లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-11T20:09:07+05:30 IST

జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా విరాట్ భారత్, క్రీడా భారతి అధ్వర్యంలో ‘యోగా సప్తాహం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

‘యోగా సప్తాహం’ .. కోటి సూర్యనమస్కారాలే లక్ష్యం

హైదరాబాద్: జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా విరాట్ భారత్, క్రీడా భారతి అధ్వర్యంలో ‘యోగా సప్తాహం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 7 రోజుల్లో కోటి సూర్య నమస్కార యజ్ఞాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దీని కోసం https://www.viratbharat.org/ లో రిజిష్టర్ చేసుకోవాలి. జూన్ 14-21 వరకు ప్రతి రోజూ మనం చేయగలిగిన సూర్య నమస్కారాల సంఖ్యను కమిట్మెంట్‌లో పేర్కొని, ఆ రోజూ చేసిన సంఖ్యను లింక్‌లో అప్లోడ్ చేయాలి. గత సంవత్సరం ఇదే కార్యక్రమంలో 10 వేల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 5 లక్షల సూర్య నమస్కారాలను లక్ష్యంగా పెట్టుకోగా అతి తక్కువ సమయంలో వారం రోజుల్లో దేశ విదేశాలనుండి 42 వేల రిజిస్ట్రేషన్లు అలాగే 32 లక్షల సూర్య నమస్కారాలు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌లను లక్ష లేదా కోటి సూర్య నమస్కారాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలియని వారు యూట్యూబ్‌లో చూసి తెలుసుకోవచ్చు. వయసు, ఆరోగ్యం సహకరించని వారు కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. ఆ వీడియో త్వరలో వస్తుంది. కావున వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనగలరు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ తప్పనిసరిగా రిజిష్టర్ చంసుకోగలరు. వ్యక్తిగత స్మార్ట్ ఫోన్ లేనివారిని ఇతర కుటుంబ సభ్యులెవరైనా కలుపుకోవాలి. లింక్‌లో అన్నిరకాల ఆప్షన్లు ఉన్నాయి. 



Updated Date - 2021-06-11T20:09:07+05:30 IST