కాగజ్‌నగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-16T03:57:33+05:30 IST

సర్‌సిల్క్‌కాలనీ, గాంధీచౌక్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు పలుచోట్ల సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జాతీయజెండాను ఆవిష్కరించారు.

కాగజ్‌నగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

కాగజ్‌నగర్‌, ఆగస్టు 15: సర్‌సిల్క్‌కాలనీ, గాంధీచౌక్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు పలుచోట్ల సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జాతీయజెండాను ఆవిష్కరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పలు చోట్ల కోఆర్డినేటర్‌ కోరల్ల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ చౌరస్తాలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌, వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలయంలో పెద్దపల్లి కిషన్‌ రావు, ప్రజాకార్యాలయం, నవ్‌గాం బస్తీ పలువార్డుల్లో బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్‌ అధికారి బికర్ణదాస్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రమోద్‌, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎక్బాల్‌ ఉర్దూ హైస్కూల్‌ ఓల్డు కాలనీ పాఠశాల విద్యార్థులు 120మీటర్ల అతిపెద్ద జాతీయ జెండాతో భారీర్యాలీ నిర్వహించారు. జెండాను చూసేందుకు పట్టణ నలుమూల నుంచి యువకులు, కాలనీల వాసులు రాజీవ్‌గాంధీ చౌరస్తాకు చేరుకోవటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ప్రధానోపాధ్యాయుడు మహ్మద్‌ నియాజోద్దీన్‌ బాబా, కౌన్సెలర్‌ నసీం బాను, నాయకులుపాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపాల్టీ ఉద్యోగులకు బట్టలను పంపిణీ చేపట్టారు. మున్సిపల్‌ చైర్మన్‌సద్దాం హుస్సేన్‌ ఆయావార్డుల కౌన్సెలర్లు, సిబ్బంది, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.  

- కాగజ్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరుగగా జూనియర్‌ అసిస్టెంట్‌ శ్వేత తన కూతురిని ఎత్తుకొని జాతీయజెండాకు గౌరవ వందనం చేసింది. తల్లిని చూసి చిన్నారి కూడా అదే తరహాలో పాటించడంతో అంతా అభినందించారు.

- కాగజ్‌నగర్‌లో రిటైర్డ్‌ ఆర్మీ అసోయేషన్‌ సభ్యులు నినా దాలు చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్మీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నయీం, శివ మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో అంతా పాల్గొని తమ దేశ భక్తిని చాటడం గొప్ప విషయమన్నారు.

- ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శంకర్‌, మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్‌లు జెండాను ఆవిష్కరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైలు జెండాను ఆవిష్కరించారు.

Updated Date - 2022-08-16T03:57:33+05:30 IST