ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T06:34:22+05:30 IST

జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా చిన్నారు ల కేరింతలు, గాలిపటాల ఎగరవేతలు, పిండివంటల ఘుమఘుమలు, గొబ్బెమ్మలు, అందమైన రంగవల్లులు పరిచిన నేలతో పల్లె, పట్నం సంబరాల్లో మునిగిపోయాయి.

ఘనంగా సంక్రాంతి సంబరాలు
మంత్రి కొప్పులకు శుభాకాంక్షలు తెలుపుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌

- ఆకట్టుకున్న గంగిరెద్దులు, హరిదాసుల విన్యాసాలు

జగిత్యాల అర్బన్‌, జనవరి 16: జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఎక్కడ చూసినా చిన్నారు ల కేరింతలు, గాలిపటాల ఎగరవేతలు, పిండివంటల ఘుమఘుమలు, గొబ్బెమ్మలు, అందమైన రంగవల్లులు పరిచిన నేలతో పల్లె, పట్నం సంబరాల్లో మునిగిపోయాయి. గంగిరెద్దులు, హరిదాసుల విన్యాసాలు ఆహ్లాదపరిచాయి. ఆలయాల్లో గోదాదేవి కల్యాణాలు వైభవంగా జరుగగా, కొవిడ్‌ నిబంధనల నడుమ భక్తులు ఆలయాలకు వెళ్లి, వేడుకలను తిలకించారు. పట్టణంలోని పలు ప్రధాన ఆలయాల్లో  సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. 

సంక్రాంతి పండగ సందర్భంగా బల్దియా ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి దంపతులు తమ  ఇంటిపై పిల్లలతో కలిసి గాలి పటాలు ఎగరవేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యేక్వార్టల్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేడిపెల్లి తెలంగాణ జాగృతి విభాగం, టీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బల్దియా ఛైర్‌సర్సన్‌ శ్రావణి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జాగృతి కన్వీనర్‌ బూసి రాకేష్‌, ఉపాధ్యక్షులు కొంక రాజలింగం, నాయకులు కడతల వెంకటేష్‌, వేముల రాజేష్‌, ఎండీ అస్లాం తదితరులున్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ దంపతులతో పాటు, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ లకు మొక్కను అందించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జడ్పీ క్యాంప్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌వి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలతో విన్యాసాలు చేయగా, కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బసవన్నలను ఎమ్మెల్యే సంజయ్‌ శాలువాతో సత్కరించి, వారికి నగదును అందించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2022-01-17T06:34:22+05:30 IST