పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలి

ABN , First Publish Date - 2022-10-03T05:58:13+05:30 IST

పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలి

పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలి
కేశంపేట: బతుకమ్మ చీరలను అందజేస్తున్న ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌

నందిగామ/చౌదరిగూడ/కేశంపేట, అక్టోబరు 2: ప్రతిఒక్కరూ పండుగలను సంతోషంగా నిర్వహించు కోవాలన్నదే సీఎం కేసీఆర్‌ కోరిక అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఆదివారం నందిగామ మండల కేంద్రంతో పాటు మండలంలోని అప్పారెడ్డిగూడలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అధేవిధంగా నందిగామ మండల  కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నందిగామ మండలానికి చెందిన గిరిజనులు రిజర్వేషన్‌ పెంపుపై హర్షిస్తూ నందిగామలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీవై్‌సచైర్మన్‌ ఈట గణేష్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్‌రెడ్డి వైస్‌ఎంపీపీ మంజుల, పీఏసీఎస్‌ చైర్మన్లు గొర్లపల్లి అశోక్‌, రాజగోపాల్‌ సర్పంచులు జేకే.నర్సింహులు, రాజూనాయక్‌, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, ఉపసర్పంచులు కుమార్‌గౌడ్‌, నాయకులు విజయ్‌నాయక్‌, ఎంపీడీవో బాల్‌రెడ్డి, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చౌదరిగూడ మండలంలోని జిల్లేడ్‌, వాచ్యతండాలో సర్పంచ్‌ బాబురావు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని బైర్కాన్‌పల్లి, మంగళగూడ, అల్వాల, చౌలపల్లి, సంగెం గ్రామాల్లో ఎంపీపీ రవీందర్‌, చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్‌, కృష్ణయ్య, శ్రీలత శ్రీనివాస్‌, వీరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:58:13+05:30 IST