వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T04:58:15+05:30 IST

మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట లోని గోవర్థనగిరిలో వెలసిన శ్రీకృష్ణాలయంలో కృష్ణాష్టమివేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
గోవర్ధనగిరి కృష్ణాలయంలో శ్రీకృష్ణుడు స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు




 గోవర్ధనగిరిలో ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన కృష్ణాలయాలు అలరించిన చిన్నారుల నృత్యప్రదర్శనలు మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 19: మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట లోని గోవర్థనగిరిలో వెలసిన శ్రీకృష్ణాలయంలో కృష్ణాష్టమివేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, మదనపల్లె యాద వసంఘం ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేకం గా అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. దీంతో గోవర్ధనగిరి భక్తులతో కిటకిటలాడింది. ఆలయం ఆవరణలో చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు పలువురిని అలరించా యి. అదేవిధంగా చిన్నారులు వేసిన శ్రీకృష్ణుడి, గోపిక వేషధారణలు ఆక ట్టుకున్నాయి. మధ్యాహ్నం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించారు. ఉట్టి కొట్టడానికి యువ త ఉత్సాహంగా పాల్గొని పోటీపడ్డారు. ఈ పోటీని చూడటానికి భక్తులు, పట్టణప్రజలు విచ్చేసారు. రాత్రిలో ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఆలయకమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా పుంగనూరురోడ్డులోని  వెంకటమల్లప్పకాలనీలో నాగదేవత గుడి, గోశాలలో గోవులకు పూజలు చేశారు. వాసవీక్లబ్‌ తరపున గోశాల అభివృద్ధికి రూ.6వేలు వితరణ ఇచ్చారు.  ఉదయాన్నే శ్రీకృష్ణస్వామిని  వాసవీక్లబ్‌ అధ్యక్షుడు రాజేష్‌, మల్లేల పౌండేషన్‌ వ్యవస్థాపకుడు మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, ఉమాపతి, రాజశేఖర్‌, టీడీపీ నాయకుడు రామినేని జయరామ నాయుడు దర్శించుకున్నారు. 

కురబలకోటలో:మండలంలోని తెట్టులో వెలసిన శ్రీ సంతాన వేణుగో పాల స్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే భక్త్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు ఆలయ కమిటీ వారు చర్యలు చేపట్టారు.  కృష్ణ, గోపికల వేషధారణలు  సాంస్కృతిక కార్యక్రమాలు  పలువురిని ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో జడ్పీటీసీ బి.జ్యోతి,సర్పంచ్‌ నులక మనోహర్‌రెడ్డి,  ఆలయ కమిటీ చైర్మన్‌ జగన్నాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో:  కృష్ణాష్టమి వేడుకలను పీలేరులోని  శ్రీభువన  విద్యాల యలో శుక్రవారంవైభవంగా నిర్వహించారు.  విద్యార్థులకు భగవద్గీత పఠన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం పాఠ శాలలో చిన్నారులు శ్రీకృష్ణ లీలలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాలయ కరస్పాండెంట్‌ ఉమా రమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టారు. 

మదనపల్లె టౌన్‌లో: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు విద్యాసంస్థల్లో చిన్నారులు బాలకృష్ణుల వేషధారణ, ఉట్టికొట్టి ఉల్లాసంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లోని భారతీ విద్యాలయం లో చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. కరస్పాండెంట్‌ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అలాగే స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఉట్టికొట్టి శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.

తంబళ్లపల్లెలో: శ్రీ కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో  జరుపుకున్నారు.  కొంత మంది భక్తులు ఇళ్లలో రుక్మిణి సత్య భామ సమేత శ్రీ కృష్ణ భగవానుడి చిత్ర పటాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తమ పిల్లలకు శ్రీ కృష్ణుడు, యశోధల వేషధారణలతో అలంకరించి సంబరాలు చేసుకున్నారు. ఇళ్ల ముంగిట సుద్దముక్కతో చిన్నిచిన్ని పాదాలను వేసి చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. తంబళ్లపల్లెలో పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు. 

ములకలచెరువులో: మండలంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేపూరికోట పంచాయతీ రెడ్డివారి పల్లె క్రాస్‌లోని ఆవధూత ఆదినారాయణస్వామి ఆశ్రమంలో ఉన్న శ్రీ కృష్ణుడి భారీ విగ్రహానికి అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.  ఆశ్రమ నిర్వాహకులు వెంకట సుబ్బారెడ్డి స్వామి పాల్గొన్నారు. 

నిమ్మనపల్లెలో: మండలంలోని పలు దేవాలయాలలో కృష్టాష్టమి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శుక్రవారం అనేక మంది చిన్నారులు శ్రీ కృష్ణా వేషధారణలో దర్శనమిచ్చారు. చిన్ని క్రిష్ణుడు వేషంలో వున్న పిల్లలకు అనేక రకాల పిండివంటలు పెట్టారు.

గుర్రంకొండలో:కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా గుర్రంకొండ ఇందిరమ్మ కాలనీలోని శ్రీకృష్ణ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా గీతాపారాయణం చేశారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కలకడలో:మండలంలోని వివిధ ఆలయాలలో కృష్ణాష్టమిని వేడుకగా జరుపుకున్నారు. కలకడ వేణుగోపాల్‌ స్వామి ఆలయంలో ఉదయం నుం చి సుప్రభాత సేవ, స్వస్తిపుణ్యావచనం, పంచామృతాభిషేకం,  గోపూజ, ఉట్లోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

బి.కొత్తకోటలో: మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు  వైభవంగా జరుపుకున్నారు. పలుచోట్ల పలువురు చిన్నారులకు శ్రీకృష్ణుని వేషం ధరింప చేసి ఆనందించారు. నగర పంచాయతీ అయిన బి.కొత్తకోటలో, కరెంట్‌ కాలనీలో చిన్నారులందరు కృష్ణుడు, గోపికల అలంకరణతో  వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. 

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో శుక్రవారం శ్రీకృష్టాష్టమి వేడుకలు వైభవంగాజరిగాయి.  ఈ సందర్భంగా మండలంలోని సి. గొల్లపల్లి, గుర్రంవాండ్లపల్లి, బిక్కావాండపల్లి , బండ్రేవు, గంగతాతాగా రిపల్లి, చిన్ననాయనగారిపల్లి, ముసలికుంటవారిపల్లి తదితర గ్రామాలలో   చిన్నారులు శ్రీకృష్టుడి వేశాధారణలతో ఆకట్టుకున్నారు. 





Updated Date - 2022-08-20T04:58:15+05:30 IST