గాంధీ ఆస్పత్రిలో రోగులపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్

ABN , First Publish Date - 2020-06-03T16:36:16+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స జరుగుతున్న వార్డులో..

గాంధీ ఆస్పత్రిలో రోగులపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స జరుగుతున్న వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలోని 7వ అంతస్తులో పలువురు కరోనా పాజిటీవ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఓ ఫ్యాన్ ఆకస్మాత్తుగా హుక్ నుంచి వేరుపడి కింద ఉన్న రోగులపై పడింది. దీంతో తాము మరింత భయాందోళనలకు గురయ్యామని రోగులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Updated Date - 2020-06-03T16:36:16+05:30 IST