అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) వర్చువల్ బ్రీఫింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా 35 మంది ఐఏఎస్, 9 మంది ఐపీఎస్ అధికారులు వెళ్లనున్నారు.