Abn logo
Sep 21 2021 @ 13:15PM

సీఈటీ ఫలితాలు విడుదల.. స్టేట్‌టాపర్‌ మేఘన్‌

బెంగళూరు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ తదితర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశానికి కర్ణాటక పరీక్షా ప్రాధికార నిర్వహించిన సీఈటీ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ సోమవారం ప్రకటించారు. మైసూరుకు చెందిన మేఘన్‌ రాష్ట్రానికి టాపర్‌గా నిలిచాడు. ఇంజనీరింగ్‌, పశువైద్యం, యో గా, అగ్రికల్చర్‌ సైన్స్‌, నేచురోపతి విభాగాలన్నింటిలోనూ అగ్రస్థానం నిలిచాడు. మైసూరు కువెంపునగర్‌లోని ప్రమతి కళాశాలలో సీబీఎ్‌సఈ విభాగంలో మేఘన్‌ 500 మార్కులకుగాను 494 మార్కులు సాధించాడు. మేఘన్‌ తల్లిదండ్రులు ఇద్దరూ వేర్వేరు కళాశాలల్లో ప్రిన్సిపాళ్లుగా సేవలందిస్తున్నారు. తండ్రి కృష్ణయ్య కేఆర్‌నగర్‌లోని కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా తల్లి లీలావతి రామకృష్ణనగర్‌లోని కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తోంది. కాగా ఈసారి సీఈటీ పరీక్షలకు 70, 888 మంది బాలురు, 85,022 మంది బాలికలు హాజరయ్యారు. ర్యాంకులు పొందిన విద్యార్థుల డాక్యమెంట్ల పరిశీలన ఈ నెల 30 న ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి మీడియాకు తెలిపారు.