స్థానిక ఎన్నికలపై బీజేపీ, బీఎస్పీలది ఒకే మాట

ABN , First Publish Date - 2020-10-28T15:45:12+05:30 IST

ధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిగాయని అభిప్రాయపడ్డ పార్టీలు..

స్థానిక ఎన్నికలపై బీజేపీ, బీఎస్పీలది ఒకే మాట

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి తమ అభిప్రాయాన్ని బీఎస్పీ, బీజేపీ ప్రతినిధులు తెలియజేశారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి సూచించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిగాయని అభిప్రాయపడ్డ పార్టీలు.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. 


వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళ ఈసీ భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకి ఈసీ కార్యాలయంలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక్కోపార్టీకి ఒక్కో సమయాన్ని ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేటాయించారు. ఈసీ సమావేశానికి వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకోగా, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కాంగ్రెస్‌ నుంచి మస్తాన్‌ వలీ హాజరవుతున్నారు.  

Updated Date - 2020-10-28T15:45:12+05:30 IST