ఉగ్రవాదంలో ఆఫ్ఘన్ ప్రభావాన్ని తిప్పికొడతాం : జనరల్ రావత్

ABN , First Publish Date - 2021-08-26T00:16:19+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ తిరుగుబాట్ల ప్రభావం భారత దేశంపై పడితే దీటుగా

ఉగ్రవాదంలో ఆఫ్ఘన్ ప్రభావాన్ని తిప్పికొడతాం : జనరల్ రావత్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్  తిరుగుబాట్ల ప్రభావం భారత దేశంపై పడితే దీటుగా ఎదుర్కొంటామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ప్రస్తుతం ఉగ్రవాదంతో వ్యవహరిస్తున్నట్లుగానే ఆఫ్ఘన్ తిరుగుబాట్ల ప్రభావాన్ని కూడా తిప్పికొడతామని తెలిపారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటంలో భాగంగా అందజేసిన సహాయం మాదిరిగానే, నిఘా సమాచారం రూపంలో అదనపు మద్దతును భారత దేశం స్వాగతిస్తుందని చెప్పారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) బుధవారం నిర్వహించిన ‘ది ఇండియా-యూఎస్ పార్టనర్‌షిప్ : సెక్యూరింగ్ ది ట్వంటీఫస్ట్ సెంచరీ’  కార్యక్రమంలో జనరల్ రావత్ మాట్లాడారు. 


జనరల్ రావత్ క్వాడ్ దేశాలను ఉద్దేశించి నిఘా సమాచారం కోసం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండర్ జాన్ అక్విలినో కూడా పాల్గొన్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటారని భారత దేశం ముందుగానే ఊహించిందని జనరల్ రావత్ అన్నారు. మంగళవారం జరిగిన ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ విషయాన్ని ప్రస్తావించిందన్నారు. ఆఫ్ఘన్ గడ్డను ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించడానికి ఉపయోగించుకోబోరనే ఆశాభావాన్ని భారత దేశం వ్యక్తం చేసిందన్నారు. 


Updated Date - 2021-08-26T00:16:19+05:30 IST