లేహ్‌కు రావత్.. కోర్ కమాండర్‌తో చర్చలు

ABN , First Publish Date - 2020-07-03T05:10:25+05:30 IST

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్ శుక్రవారం లేహ్ వెళ్లనున్నారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాల దాడిలో గాయపడిన భారత జవాన్లను ఆయన పరామర్శిస్తారు.

లేహ్‌కు రావత్.. కోర్ కమాండర్‌తో చర్చలు

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్ శుక్రవారం లేహ్ వెళ్లనున్నారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాల దాడిలో గాయపడిన భారత జవాన్లను ఆయన పరామర్శిస్తారు. అదే సమయంలో కోర్ కమాండర్‌తో చర్చలు జరుపుతారు. చైనాతో ఉద్రిక్తతల వేళ రావత్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.  


ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. చైనా బలగాల దాడిని తిప్పికొట్టిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు కూడా అందించారు. ఎల్‌ఏసీ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులతో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు. 


మరోవైపు లడక్ వెళ్లాలనుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

Updated Date - 2020-07-03T05:10:25+05:30 IST