సోన్‌ చెక్‌పోస్ట్‌లో సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని సోన్‌ గోదావరి నది వంతెన వద్ద గల చెక్‌ పోస్ట్‌ వద్ద సీసీ కెమెరాలు పునః ప్రారంభించారు.

సోన్‌ చెక్‌పోస్ట్‌లో సీసీ కెమెరాలు
సోన్‌ చెక్‌పోస్టులు తిరిగి పనిచేస్తున్న సీసీ కెమెరాలు

సోన్‌, జూన్‌ 22 : నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని సోన్‌ గోదావరి నది వంతెన వద్ద గల చెక్‌ పోస్ట్‌ వద్ద సీసీ కెమెరాలు పునః ప్రారంభించారు. గత రెండు సంవత్సరాల క్రితం సీసీ కెమెరాలు చెడి పోవడంతో మరమ్మతులకు నోచుకోలేదు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో సరిహద్దు ప్రాంతం నుండి అక్రమ కలప రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పని చేయకపో వడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం జిల్లా స్థాయి అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని సీసీ కెమెరాలను పునః ప్రారంభించి జిల్లా కేంద్రంలోని డీఎఫ్‌వో కార్యాలయంలో అనుసంధానం చేశారు. చెక్‌ పోస్ట్‌ వద్ద ఏమి జరిగినా క్షణాల్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా సోన్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో గట్టి నిఘా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. 

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST