గుట్కా అక్రమ రవాణాపై సీసీఎస్‌ పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2022-07-06T06:05:52+05:30 IST

గుట్కా అక్రమ రవాణాపై జగిత్యాల సీసీఎస్‌ పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. 1.32 లక్షల విలువగల గుట్కా సంచులతో పాటు, ఒక స్కూటీ, నాలుగు సెల్‌ ఫోన్లు పోలీసులు సీజ్‌ చేశారు.

గుట్కా అక్రమ రవాణాపై సీసీఎస్‌ పోలీసుల దాడులు
పట్టుకున్న గుట్కా ప్యాకెట్లతో సీసీఎస్‌ పోలీసులు-

జగిత్యాల టౌన్‌,  జూలై 5 : గుట్కా అక్రమ రవాణాపై జగిత్యాల సీసీఎస్‌ పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. 1.32 లక్షల విలువగల గుట్కా సంచులతో పాటు, ఒక స్కూటీ, నాలుగు సెల్‌ ఫోన్లు పోలీసులు సీజ్‌ చేశారు. ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని వివిధ కిరాణ షాపులపై దాడులు నిర్వహించారు. మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన రంగ శివకుమార్‌, టీఆర్‌నగర్‌ చెందిన బొమ్మెర శ్రీనివాస్‌, బొర్ర రవీందర్‌, జగిత్యాల పట్టణానికి చెందిన కటకం సత్యనారాయణలు అక్రమంగా గుట్కాను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద రూ. 1.32 లక్షల విలువగుట్కా సంచులతో పాటు, ఒక స్కూటీ సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేయడంతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల, నిజామాబాద్‌ జిల్లాల కేంద్రంగా జగిత్యాల జిల్లాకు  నిషేదిత గుట్కా సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల బృందం మంచిర్యాల, నిజామాబాద్‌లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. మంచిర్యాలకు చెందిన అభిషేక్‌, నిజామాబాద్‌కు చెందిన అబ్బు కిరాణా యజమాని పరారీలో ఉన్నట్లు సీఐ కిరణ్‌ పేర్కొన్నారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ నిషేదిత గుట్కా ఉత్పత్తులను అమ్మినా, సరఫరా చేసినా చట్టరీ త్యా చర్యలు తప్పవన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ఎస్సై రహీం, సీసీఎస్‌ ఎస్సై రవీందర్‌, సిబ్బంది కిరణ్‌, రమేష్‌, శ్రీధర్‌ రెడ్డి ఉన్నారు.

ఫ జగిత్యాల పట్టణంలో అక్రమంగా నిలువ ఉంచిన నిషేధిత గుట్కాను మంగళవారం పట్టుకున్నట్లు టౌన్‌ సీఐ కిషోర్‌ తెలిపారు. పట్టణంలోని బాలాజీ కిరాణంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ.లక్షా 15వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని యజమాని లింగన్నపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ దాడుల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

ఫ గొల్లపల్లి : గొల్లపల్లి ఎస్సై దత్తాద్రి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి గుట్కా, అంబార్‌ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. నల్లగుట్ట బస్టాండ్‌లో లక్ష్మీ కిరాణంలో పోలీసులు సోదాలు చేయగా రూ.5,521 విలువ గల వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు, అంబార్‌ ప్యాకె ట్లు, అలాగే బస్టాండ్‌లోని లావణ్య కిరాణం దుకాణంలో సోదాలు చేయగా రూ. 7,515 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పోలీసులకు పట్టుబడ్డాయి. వీటిని విక్రయిస్తున్న కొత్తపెల్లి శ్రావణ్‌ కుమార్‌, చిట్టీమల్ల రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దత్తాద్రి ఈ సందర్భంగా పేర్కోన్నారు. నిషేధిత గుట్కాలు, అంబార్‌ ప్యాకెట్లను కొనుగోలు చేసిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. 

ఫ సారంగాపూర్‌ : మండలంలోని అర్పపల్లి గ్రామానకి చెందిన కట్ట బ్రహ్మం, గొల్లపెల్లి రవి అనే ఇద్దరు దుకాణం యజమానులు గుట్కాను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై మనోహర్‌రావు తన సిబ్బందితో దాడి చేసి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైన గుట్కాను విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఫ మల్యాల : మల్యాల బ్లాక్‌ చౌరస్తా వద్ద గల పాన్‌షాప్‌లో నిషేదిత గుట్కా పట్టుకున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఈ మేరకు రూ. 10వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-07-06T06:05:52+05:30 IST