సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.58 కోట్లు

ABN , First Publish Date - 2022-01-20T06:16:21+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ రూ.423.59 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.58 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ రూ.423.59 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.299.84 కోట్లతో పోలి స్తే 41 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి నికర లాభం రూ.47.11 కోట్ల నుంచి రూ.58.46 కోట్లకు చేరింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.1,086.65 కోట్ల ఆదాయంపై రూ.151.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సీ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. 2021-22 ఏడాదికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. 

Updated Date - 2022-01-20T06:16:21+05:30 IST