రూ.320 కోట్ల పెట్టుబడులు
త్రైమాసిక లాభం రూ.53 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కాఫీని ఎగు మతి చేస్తున్న సీసీఎల్ ప్రొడక్ట్స్ తిరుపతి సమీపంలో కొత్త కాఫీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 100 శాతం సొంత అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వకొల్లి గ్రామంలో 16 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్ర్పే డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ తయారీకి కొత్త యూనిట్‌ను ఏర్పా టు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.320 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయంగా కొత్త కాఫీ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల సీసీఎల్ మేనే జింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి సమీపంలో కొత్త కాఫీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.52.74 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.43.84 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.326 కోట్ల నుంచి రూ.509 కోట్లకు పెరిగింది.