2 మెగా ఒప్పందాలకు సీసీఐ అనుమతి

ABN , First Publish Date - 2022-08-14T09:03:21+05:30 IST

మార్కెట్‌ పోటీ నియంత్రణ మండలి ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ (సీసీఐ) రెండు మెగా ఒప్పందాలకు ఆమోదం తెలిపింది.

2 మెగా ఒప్పందాలకు సీసీఐ అనుమతి

న్యూఢిల్లీ: మార్కెట్‌ పోటీ నియంత్రణ మండలి ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ (సీసీఐ) రెండు మెగా ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌తో హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ విలీన ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద గృహ రుణ ఎన్‌బీఎ్‌ఫసీ హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌.. తన అనుబంధ సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌లో విలీనం కాబోతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కాగా, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికీ సీసీఐ అనుమతి లభించింది. అదానీ గ్రూప్‌ ఈ రెండు కంపెనీలను అంతర్జాతీయ సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌ నుంచి కొనుగోలు చేసింది. 

Updated Date - 2022-08-14T09:03:21+05:30 IST