పనులను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
కందుకూరు జనవరి 28: మండలంలోని లేమూరు గ్రామంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి శుక్రవారం సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రూ.10లక్షల నిధులతో సీసీరోడ్డు పనులను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ జె.పరంజ్యోతి, మాజీ సర్పంచ్ గణేష్, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, అనేగౌనిపాండుగౌడ్ పాల్గొన్నారు.