CBSE Class 12 result : బాలికల హవా.. ఇద్దరికి 500/500 మార్కులు

ABN , First Publish Date - 2022-07-22T23:47:36+05:30 IST

గురువారం విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలిక హవా కొనసాగింది. ఇద్దరు బాలికలైతే ఏకంగా 100 శాతం మార్కులు సాధించి..

CBSE Class 12 result : బాలికల హవా.. ఇద్దరికి 500/500 మార్కులు

న్యూఢిల్లీ : శుక్రవారం విడుదలైన సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి ఫలితాల్లో (CBSE Class 12 result) బాలికల(Girls) హవా కొనసాగింది. ఇద్దరు బాలికలైతే ఏకంగా 100 శాతం మార్కులు సాధించి.. ఔరా అనిపించుకున్నారు. వీరిలో ఒకరు ఢిల్లీ ఎన్‌సీఆర్(National Capital Region)లోని నోయిడాకి చెందిన యువక్షి విజ్(Yuvakshi Vij) కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌కు చెందిన తన్యా సింగ్ (Tanya Singh) ఇద్దరూ 500/500 శాతం మార్కులు (500/500 Marks) సాధించారు. తన్యా సింగ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని కావడం విశేషం. మరో ముగ్గురు బాలికలు కేవలం ఒకే ఒక్క మార్కు తేడాతో 500 స్కోర్‌ను కోల్పోయారు. దీపికా బన్సల్, రాధికా అగర్వాల్, భూమిక గుప్తా ముగ్గురూ 499 చొప్పున మార్కులు సంపాదించారు. ఘజియాబాద్‌నకు చెందిన మరో బాలిక అషీమా 497 మార్కులు(99.4 శాతం) పొందింది.


రికార్డు స్థాయి మార్కులు సాధించడంలో తోడ్పాటునందించిన ఉపాధ్యాయులకు తన్యా ధన్యవాదాలు తెలిపింది. తన విజయంలో కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని చెప్పింది. ఇక ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నట్టు ఆమె చెప్పింది. యువక్షి స్పందిస్తూ.. అన్ని సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, హిస్టరీ, సైకాలజీ, పెయింటింగ్‌లలో 100కి 100 మార్కులు సాధించానని తెలిపింది. మంచి మార్కులు రావడంపట్ల ఉల్లాసంగా ఉన్నానని పేర్కొంది.


కాగా ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ విద్యార్థుల్లో 95 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 33,432గా ఉంది. పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఈ సంఖ్య 2.33 శాతంగా ఉంది. ఇక 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 1,34,797గా ఉంది. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యలో వీళ్లు 9.39 శాతంగా ఉన్నారు.


ఢిల్లీలో 96.29 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఢిల్లీ జోన్‌లో మొత్తం 3,00,075 మంది విద్యార్థులు ఉండగా అందులో 2,98,395 మంది పరీక్షలు రాయగా 2,87,236 మంది పాసయ్యారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే 14,44,341 మంది విద్యార్థులు ఉండగా 14,35,366 మంది పరీక్ష రాశారు. అందులో 13,30,662 మంది ఉత్తీర్ణత సాధించారు. 

Updated Date - 2022-07-22T23:47:36+05:30 IST