Rajastan SBI : రూ.11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యం... 25 చోట్ల సీబీఐ సోదాలు...

ABN , First Publish Date - 2022-08-19T00:30:09+05:30 IST

రాజస్థాన్ (Rajasthan)లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) కరౌలీ శాఖ నుంచి రూ

Rajastan SBI : రూ.11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యం... 25 చోట్ల సీబీఐ సోదాలు...

న్యూఢిల్లీ : రాజస్థాన్ (Rajasthan)లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) కరౌలీ శాఖ నుంచి రూ.11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 13న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ఆదేశించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి గురువారం 25 చోట్ల సోదాలు నిర్వహించింది. 


ఎస్‌బీఐ కరౌలీ శాఖ 2021 ఆగస్టులో నగదు నిల్వల తనిఖీని నిర్వహించాలని నిర్ణయించింది. ఓ ప్రైవేటు సంస్థ చేత తనిఖీలు చేయించింది. రూ.11 కోట్ల విలువైన నాణేలు కనిపించడం లేదని ఈ తనిఖీల్లో వెల్లడైంది. 


సీబీఐ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, 15 మంది మాజీ బ్యాంకు అధికారులు, ఇతరులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, సవాయ్ మాధోపూర్, ఆల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారాలలోని 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. 



Updated Date - 2022-08-19T00:30:09+05:30 IST