నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు...సీబీఐ కేసు

ABN , First Publish Date - 2021-01-15T17:58:30+05:30 IST

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది....

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు...సీబీఐ కేసు

న్యూఢిల్లీ : నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంటీఎన్ఎల్ లలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ చేసిన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని సీబీఐ దర్యాప్తులో తేలింది. 35 ఏళ్ల పాటు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేశారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సీబీఐ అధికారులు యూపీ, ఢిల్లీలలో సోదాలు జరిపారు. ఈపీఎఫ్ఓ కార్యాలయంలో 1985 జులై 24వతేదీన క్లర్కుగా నకిలీ ఎస్టీ సర్టిఫికెటుతో ఉద్యోగం పొందారని వెల్లడైంది. అనంతరం మధుర అకౌంట్సు ఆఫీసరుగా పదోన్నతి పొందారు. ఎంటీఎన్ఎల్ సంస్థలో జూనియర్ టెలికం ఆఫీసరుగా నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారని వెల్లడైంది. ఎంటీఎన్ఎల్ 2018 జులై 31 న సీనియర్ మేనేజరుగా పదవీ విరమణ చేశారు. 

Updated Date - 2021-01-15T17:58:30+05:30 IST