సీఎం Ashok Gehlot సోదరుడి ఇంట్లో CBI సోదాలు

ABN , First Publish Date - 2022-06-17T17:29:23+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్(Ashok Gehlots) సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్(Agrasen Gehlot) ఇంట్లో సీబీఐ(

సీఎం Ashok Gehlot సోదరుడి ఇంట్లో CBI సోదాలు

న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్(Ashok Gehlots) సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్(Agrasen Gehlot) ఇంట్లో సీబీఐ(CBI) అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. అగ్రసేన్ గెహ్లాట్‌కు చెందిన వ్యాపార కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిపామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఫెర్టిలైజర్ల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ఈడీ(Enforcement Directorate) ఇదివరకే దర్యాప్తు మొదలుపెట్టింది. 2007, 2009 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో ఎరువులను చట్టవిరుద్ధంగా విదేశాలకు ఎగుమతి చేశారని ఈడీ పేర్కొంది. అగ్రసేన్ గెహ్లాట్‌కు చెందిన ‘అనుపమ్ కృషి’ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్’ అనే కంపెనీ ద్వారా పోటాష్‌ను విదేశాలకు ఎగుమతి చేసిందని ఆరోపించింది. ఎగుమతి చేసిన ఎరువులు రాజస్థాన్ రైతుల కోసం ఉద్దేశించినవని వెల్లడించింది. ఈ ఎరువుల కేసులో ఎక్స్‌పోర్టింగ్ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్‌’తోపాటు ఇతర కంపెనీలపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈడీ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే.


రాజకీయ కక్ష సాధింపు..

సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడి ఇంట్లో ఏసీబీ సోదాలను కాంగ్రెస్ పార్టీ(Congress party) ఖండించింది. కక్షపూరిత రాజకీయ చర్యగా అభివర్ణించింది. హద్దులు దాటి చేసిన విధ్వేషపూరిత రాజకీయ దాడి ఇదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘గత మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను సీఎం గెహ్లాట్ ముందుండి నడిపిస్తున్నారు. అందుకే బీజేపీ నిస్సిగ్గుగా ఈ సోదాలకు  ఉపక్రమించింది. అయినా మేము మౌనంగా ఉండబోం’’ అని రాహుల్ గాంధీ- ఈడీ విచారణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఆయన ప్రస్తావించారు.

Updated Date - 2022-06-17T17:29:23+05:30 IST