చిత్ర రామకృష్ణ కేసు... సెబీ అధికారులతో సీబీఐ భేటీ

ABN , First Publish Date - 2022-02-22T01:27:41+05:30 IST

న్‌ఎస్‌ఇ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ముంబైలోని సెబీ భవన్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబి అధికారులతో సమావేశమయ్యారు(ఈ భేటీ వారం క్రితమే జరిగినట్లు సంబంధిత వర్గాలు ఆ తర్వాత వెల్లడించాయి).

చిత్ర రామకృష్ణ కేసు... సెబీ అధికారులతో సీబీఐ భేటీ

ముంబై : ఎన్‌ఎస్‌ఇ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ముంబైలోని సెబీ భవన్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబి అధికారులతో సమావేశమయ్యారు(ఈ భేటీ వారం క్రితమే జరిగినట్లు సంబంధిత వర్గాలు ఆ తర్వాత వెల్లడించాయి). ఈ కేసుతోపాటు సెబీ ఇటీవలి ఉత్తర్వుల గురించి మరింత అర్థం చేసుకోవాలని తాము భావిస్తున్నట్లు సీబీఐ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ ఎండీ/సీఈఓ  చిత్రా రామకృష్ణ... హిమాలయాల్లో నివసించే ఆధ్యాత్మిక యోగి అనే వ్యక్తితో రహస్య డేటా,  మార్పిడి సమాచారాన్ని ఎలా పంచుకుంటున్నారో ఈ సందర్భంగా అధికారులు సేకరించారు. ఆధ్యాత్మిక యోగి కాకుండా ఇతరత్రా మరెవరికైనా సున్నితమైన సమాచారాన్నందించారా ? అన్న దిశగా  సీబీఐ అధికారులు వివరాలను సేకరించారు.  ఈ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) రవి నరేన్‌, రామకృష్ణలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. నరైన్ ఏప్రిల్ 1994 నుండి మార్చి 31, 2013 వరకు ఎన్‌ఎస్‌ఈ ఎండీ/సీఈఓ గా పనిచేశారు. చిత్రా రామకృష్ణ సలహాదారుగా ఎటువంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని మిడ్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకంపై, తగిన డాక్యుమెంటేషన్ సహా పలువురు ఎన్‌ఎస్‌ఈ  అధికారుల కంటే అధిక వేతనంతో పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. 

Updated Date - 2022-02-22T01:27:41+05:30 IST