హైదరాబాద్: సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దాల్మియా కేసులో హాజరుకానందున శ్రీలక్ష్మికి వారెంట్(ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరైనారు. వాన్‌పిక్ కేసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హాజరుకాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు హాజరుకాకపోతే ఉత్తర్వులు ఇస్తామని కోర్టు హెచ్చరించింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు. జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.